Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'క్వీన్' చిత్ర‌ ద‌ర్శ‌కుడితో వివాదంపై స్ప‌ష్ట‌త‌నిచ్చిన త‌మ‌న్నా

  • సినిమా నిర్మాణ‌ వ్య‌వ‌హారాల‌తో త‌న‌కు సంబంధంలేద‌ని వెల్ల‌డి
  • నిర్మాతకే స‌ర్వాధికారాల‌ని వ్యాఖ్య‌
  • ద‌ర్శ‌కుడు నీల‌కంఠ‌తో త‌మ‌న్నాకు గొడ‌వ జ‌రిగిందంటూ వార్త‌లు
హిందీ చిత్రం 'క్వీన్' నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. వీటిలో తెలుగు వెర్ష‌న్‌లో త‌మ‌న్నా న‌టిస్తోంది. అయితే ఇటీవ‌ల చిత్ర ద‌ర్శ‌కుడు నీల‌కంఠ‌కు, త‌మ‌న్నాకు మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌లపై స్ప‌ష్ట‌తనిచ్చేందుకు త‌మ‌న్నా రంగంలోకి దిగింది. సినిమా నిర్మాణ వ్య‌వ‌హారాల‌తో త‌న‌కు సంబంధంలేద‌ని, ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని, సినిమా బాధ్య‌త మొత్తం నిర్మాత మ‌ను కుమార‌న్ చేతిలోనే ఉంద‌ని ఆమె అంది.

‘నా కారణంగా సినిమా నుంచి దర్శకుడు నీలకంఠ తప్పుకున్నారని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సినిమా నిర్మాణం విషయంలో నాకు కానీ నా టీమ్‌కు కానీ ఎలాంటి అధికారం లేదు. సినిమా పరంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది నిర్మాతే. నీలకంఠ సర్‌ అంటే నాకు గౌరవం ఉంది. నిర్మాత మను కుమారన్‌ నవంబర్‌లోనే సినిమాలో కొన్ని మార్పులు చేశారు. నాలుగు భాషల్లో వస్తున్న ఈ సినిమా మాకు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ లాంటిది. అందరం ఐకమత్యంతో వ్యవహరిస్తున్నాం.’ అని తమన్నా తెలిపారు.
queen
Tamannaah
neelakanta

More Telugu News